
Jio-Airtel-VI | ఇంటర్నెట్‌ డెస్క్: మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్‌ ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-6 నెలల్లో మొబైల్‌ టారిఫ్‌లు 10-15 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌లను తొలగించింది. మరో టెలికాం కంపెనీ జియో రూ.300తో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ సభ్యత్వం తీసుకుంటే ఏడాది పాటు టారిఫ్‌ల సవరణ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది. తద్వారా రెండు టెలికాం కంపెనీలు టారిఫ్‌ల సవరణ తప్పదనే సంకేతాలు ఇచ్చాయి. రీఛార్జ్ ధరలు పెరిగే ప్రమాదం ఉన్నందున టెలికాం కంపెనీలు అందిస్తున్న వార్షిక ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటే ధరల పెంపు నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా.. 365 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్న ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.. జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే వొడాఫోన్‌లో ఎక్కువ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



