
IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) మెగా లేదా మినీ ఆక్షన్‌కు సంబంధించి ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక తేదీని ప్రకటించలేదు. ఈసారి ఆక్షన్‌ను భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆక్షన్ ప్రక్రియ ప్రారంభానికి వారం రోజుల ముందు వరకు ట్రేడ్ విండో అందుబాటులో ఉండటంతో.. ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ జోరుగా సాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడం, ఆయన బదులుగా కుల్దీప్ యాదవ్ లక్నోకి వెళ్లడం వంటి భారీ ట్రేడింగ్ జరగగా.. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన డీల్స్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.




