
మహనీయుల పోరాటాలే కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు పాల్గొన్నారు. ఈసందర్భంగా రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌ భారత్‌తో అంతర్భాగం కావడానికి ఎందరో మహనీయులు బలిదానాలు చేశారంటూ వారందరికీ నివాళులర్పించారు.




