
ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న 3వ టీ20కి ముందు టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ల ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత్ అలవోకగా గెలిచింది. మరోవైపు పవర్‌ప్లే వైఫల్యాలు, బౌలర్లు తేలిపోవడంతో ఆఫ్ఘన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఆఖరి పోరులో బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించేందుకు భారత్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చే యోచనలో ఉంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.