
ICC : ఎనిమిదోసారి ఆసియా కప్ గెలుపొందినా ట్రోఫీని అందుకోని భారత మహిళల జట్టుకు మరో షాక్. ఫైనల్ మ్యాచ్ తర్వాత పేసర్ క్రాంతి గౌడ్ (Kranti Gaud)కు ఐసీసీ జరిమానా విధించింది. శ్రీలంకతో జరిగిన టైటిల్ పోరులో క్రాంతి ఐసీసీ నియమావళిని ఉల్లఘించడమే అందుకు కారణం. నిబంధనలను అతిక్రమించినందుకు ఆమెకు మ్యాచ్ ఫీజులో కోత పడింది. అలానే ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది ఐసీసీ. మహిళల ఆసియా కప్‌లో మెరిసిన భారత పేసర్ క్రాంతి గౌడ్‌కు జరిమానా పడింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు ఆమెకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది ఐసీసీ. ఆర్టికల్ 2.5ను అతిక్రమించినందున ఫైన్‌తో పాటు మరోసారి తప్పు చేయకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. రిఫరీ ముందు హాజరైన క్రాంతి తన తప్పును అంగీకరించింది. Kranti Gaud breached Level 1 of the ICC Code of Conduct during the Women’s Asia Cup final against Sri Lanka. The incident occurred in the first over of Sri Lanka’s innings, when after dismissing opener Imesha Dulani, Gaud gestured in the direction of the pavilion. Additionally,… pic.twitter.com/xfvUrRljzx — Cricbuzz (@cricbuzz) September 14, 2026 టాస్ గెలిచిన భారత్ ఓపెనర్లు షఫాలీ వర్మ(68), స్మృతి మంధాన(59) మెరుపులతో 183 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో శ్రీలంకకు తొలి ఓవర్లోనే వికెట్ తీసింది క్రాంతి గౌడ్. ఓపెనర్ ఇమేష దులానీ(Imesha Dulani)ని క్లీన్‌బౌల్డ్ చేసి బ్రేకిచ్చింది. అయితే.. వికెట్ తీసిన ఆనందంలో తను గట్టిగా అరిచి.. ఇక వెళ్లు అన్నట్టుగా చేత్తో సైగ చేసింది. దులానీ వికెట్ తీశాక భారత పేసర్ సెలబ్రేషన్ రెచ్చగొట్టేలా ఉందని భావించిన రిఫరీ ఫిర్యాదు చేసింది. Kranti Gaud strikes in her very first over, picking up India’s first wicket! 👊 Watch the #DPWorldWomensAsiaCup2026 FINAL LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #INDvSL #NotAGentlemansGame pic.twitter.com/DDVdhnoc7W — Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 మ్యాచ్ అనంతరం విచారణకు హాజరైన క్రాంతి తన పొరపాటును అంగీకరించింది. దాంతో.. మ్యాచ్ ఫీజులో పది శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపుచ్చింది రిఫరీ. ఫైనల్లో 72 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది.





