
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను (IND vs AFG) భారత్‌ కైవసం చేసుకుంది. దిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజు శాంసన్‌ (57) అర్ధశతకంతో చెలరేగాడు. అభిషేక్‌ శర్మ(39), ఇషాన్‌ కిషన్‌ (38*) రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ (11), తిలక్‌ వర్మ (15*) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం బద్రాన్‌ (37) టాప్‌ స్కోరర్‌. రసూలి (26), రషీద్‌ ఖాన్‌ (28), నబీ (20) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో నితీశ్‌కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




