
ఢిల్లీలో జరిగిన 2వ టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్, సంజు శాంసన్ (22 బంతుల్లో 57), అభిషేక్ శర్మ (19 బంతుల్లో 39), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 38 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో 14.5 ఓవర్లలోనే 163/3 చేసి మ్యాచ్ ముగించింది. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.