
అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత్‌ కైవసం చేసుకుంది. దిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజు శాంసన్‌ (57) అర్ధశతకంతో చెలరేగాడు. అభిషేక్‌ శర్మ(39), ఇషాన్‌ కిషన్‌ (38*) రాణించారు.