
ఉమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ 8వ సారి ఛాంపియన్గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. షెఫాలీ (68), మంధాన (59) రాణించడంతో 183/5 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను శ్రీ చరణి (4/20), దీప్తి శర్మ (3/19) కట్టడి చేయడంతో లంక 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంకపై భారత్ రివేంజ్ తీర్చుకుంది.



