
Sanju Samson: ఆఫ్ఘనిస్తాన్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. అయితే, ఈ విజయం వెనుక ఒక ఆందోళనకర విషయం కూడా ఉంది. టీమిండియా సీనియర్ ఆటగాడు సంజు శాంసన్ తన ప్రదర్శనతో అభిమానులను, విమర్శకులను నిరాశపరిచాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొన్న సంజు కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అజ్ముతుల్లా ఉమర్ జై బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతని ఈ వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా మారింది.





