
ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో (Duleep Trophy 2026) ఆడటంతో దేశవాళీ టోర్నీకి కళ వచ్చింది. ఫైనల్‌లో సౌత్‌ జోన్‌పై ఈస్ట్ జోన్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ ఫైనల్‌ తనను తీవ్రంగా నిరాశపరిచిందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కారణంగా విజేతగా నిలవడం కంటే ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్‌ చేసి ఉంటే బాగుండేదని సూచించారు. ‘‘ఫైనల్‌లో ఈస్ట్‌ జోన్ విజయం కోసం ఇలాంటి సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడం బాగోలేదు. అవసరం లేకుండా రెండోసారి బ్యాటింగ్‌ చేసినట్లు అనిపించింది. ఇక షెడ్యూల్ కంటే ముందే ఇద్దరు కెప్టెన్లు (East Zone Vs South Zone) ఓ అంగీకారానికి వచ్చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యమే సరిపోతుంది. కానీ, ఈస్ట్‌ జోన్ ఆ దిశగా ప్రయత్నించలేదు. అందుకే, అంతర్జాతీయంగానూ 20 వికెట్లను తీయడంలో మన జట్టు ఇబ్బంది పడుతోంది. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే కదా ఆ వేదికపై రాణించేందుకు అవకాశం ఉంటుంది. దేశవాళీ మ్యాచ్‌లోనే 20 వికెట్లు తీయలేకపోతే ఎలా? శ్రీలంకతో రెండో టెస్టును (India vs Sri Lanka) చూడండి. చివరి నాలుగు వికెట్లను త్వరగా తీయలేక విజయాన్ని దూరం చేసుకున్నాం. బ్యాటర్లు ఎలాగైతే హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడం నేర్చుకుంటారో.. బౌలర్లూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పదేసి వికెట్లు తీయడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ మ్యాచులను ఆడటం వల్ల వీటన్నింటినీ నేర్చుకొనేందుకు అవకాశం వస్తుంది’’ అని గావస్కర్ ( Sunil Gavaskar ) వెల్లడించారు. సౌత్‌ జోన్‌తో (South Zone) ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ 708 పరుగులు చేసింది. అనంతరం సౌత్ జోన్ 338 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్‌ జోన్‌కు 372 పరుగుల లీడ్‌ దొరికింది. కానీ, సౌత్‌ జోన్‌కు ఫాలో ఆన్ ఇవ్వకుండా ఇషాన్‌ కిషన్ ( Ishan Kishan ) రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించాడు. ఐదో రోజు మధ్యాహ్నానికి 338/7 స్కోరు చేసింది. దీంతో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో కెప్టెన్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌ లీడ్ కారణంగా ఈస్ట్‌ జోన్‌ కప్పును సొంతం చేసుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు దులీప్ ట్రోఫీని నెగ్గింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మహిళల ఆసియా కప్‌ను ఎనిమిదోసారి టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ మీరూ చూసేయండి.. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.





