
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (37) టాప్‌ స్కోరర్‌. భారత్‌ బౌలర్లలో నితీశ్‌కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.




