
హైదరాబాద్‌: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software employee) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన యశ్వంత్ (23) గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా పది రోజుల క్రితమే మాదాపూర్ పరిధిలోని అవాస కో-లివింగ్ హాస్టల్‌కు వచ్చి.. రూమ్ నంబర్ 206లో ఉంటున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని హాస్టల్ నిర్వాహకులకు చెప్పాడు. అనూహ్యంగా ఆ తర్వాత హాస్టల్ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. విహారయాత్రలో విషాదం.. సోకిలేరు వాగులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గల్లంతు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




