
రన్నింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక గంట రన్నింగ్ చేయడం వల్ల 600 నుంచి 950 కేలరీలు ఖర్చు అవుతాయని హెల్త్‌లైన్ తెలిపింది. అయితే పరిగెత్తే వేగం, మీ బరువుపై కేలరీల బర్నింగ్ అధారపడి ఉంటుంది. వేగంగా గెంతులు వేస్తూ జంప్ రోప్ వ్యాయామం చేయడం వల్ల గంటలకు 600 నుంచి 800 కేలరీలు ఖర్చు అవుతాయి. స్క్వాట్స్, పుష్-అప్స్, జంప్ చేయడం వల్ల నిమిషానికి 10 నుంచి 15 కేలరీలు ఖర్చు అవుతాయి. మెట్లు ఎక్కడం కూడా ఒక తీవ్రమైన వ్యాయామం. ఒక నిమిషం పాటు మెట్లు ఎక్కితే 8 నుంచి 11 కేలరీలు ఖర్చు అవుతాయి. స్ప్రింటింగ్ చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అధిక శ్రమతో కూడిన ఇంటర్వెల్ స్ప్రింట్లు చేయడంతో అరగంటలో 465 కేలరీలు ఖర్చు అవుతాయి. కెటిల్బాల్ స్వింగ్స్ అనేది శరీరాన్ని పూర్తిగా కదిలించే వ్యాయామం. 20 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడంతో 400 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇండోర్ రోయింగ్ చేయడం వల్ల కండరాల ఆరోగ్యంగా మారుతాయి. గంటపాటు చేస్తే 500 నుంచి 700 కేలరీలు ఖర్చు అవుతాయి. బాక్సింగ్ చేయడం వల్ల కూడా కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. బాక్సింగ్ చేస్తే 500 నుంచి 800 కేలరీలు ఖర్చు అవుతాయి. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామం చేయడం వల్ల 800 కేలరీల శక్తి బర్న్ అవుతుంది.