
2026 తొలి అర్ధ భాగంలో హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాల సంఖ్య తగ్గింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇళ్ల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. సాధారణంగా అమ్మకాలు తగ్గితే డిమాండ్ పడిపోయి ధరలు కూడా తగ్గుతాయి. కానీ హైదరాబాద్లో మాత్రం ఇళ్ల ధరలు తగ్గడం లేదు. ఇళ్ల అమ్మకాలు పడిపోయినప్పటికీ.. నగరంలో లాంచింగ్లు రెట్టింపు కావడం గమనార్హం. ఉద్యోగాల్లో అనిశ్చితితో నగరవాసులు ఇళ్లు కొనుగోలు చేయడానికి ధైర్యం చేయడం లేదు.




