

- సెప్టెంబర్ 22న ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ లాంచ్ కానుంది
- ఈ సిరీస్‌లో ఫైండ్ X10, ఫైండ్ X10 ప్రో మాక్స్, ఫైండ్ X10E
- ఈ ఒప్పో ఫోన్లు 200MP కెమెరాతో మార్కెట్లోకి రానున్నాయి
Oppo Find X10 Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. ఒప్పో ఫైండ్ X10 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఒప్పో నుంచి రాబోతున్న ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 200MP కెమెరాతో లాంచ్ కానుంది. ప్రో మాక్స్ మోడల్లో 600MP కెమెరా కూడా ఉండొచ్చు.
ఇందులో మూడు 200MP కెమెరాలు ఉంటాయి. ప్రస్తుతం, ఈ సిరీస్‌లో కంపెనీ 3 మోడళ్లను లాంచ్ చేయనుంది. ఒప్పో ఫైండ్ X10, ఫైండ్ X10 ప్రో మాక్స్, ఫైండ్ X10E ఉండనున్నాయి. ఇటీవల బీఐఎస్‌లో కూడా ఒప్పో ఫైండ్ X10 కనిపించింది. ఒప్పో ఫోన్ పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు ఒప్పో వాచ్ S2, ఎంకో X4 వేరియంట్లను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఒప్పో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఫస్ట్ చైనాలో లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న సాయంత్రం 4:30 గంటలకు (IST) జరగనుంది.
ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ వార్మ్ ఆరెంజ్, మూన్ వైట్ లైట్ టైటానియం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్10 లైట్ టైటానియం, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుండగా, ఫైండ్ ఎక్స్10ఈ ఐస్ బ్లూ లైట్ టైటానియం కలర్ ఆప్షన్లలో లభించనుంది.
స్టోరేజీ వివరాలివే :
కంపెనీ ఒప్పో ఫోన్ స్టోరేజ్ వేరియంట్లను ముందుగానే ధృవీకరించింది. ఈ సిరీస్‌లోని ఒప్పో ఫైండ్ X10, ఫైండ్ X10E ఒకే మాదిరి డిజైన్‌తో ఉంటాయి. అంతేకాదు.. చాలా ఫీచర్లు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి.
కంపెనీ ఒప్పో ఫైండ్ X10, ఫైండ్ X10 ప్రో మ్యాక్స్‌లను 12GB+256GB, 12GB+512GB, 16GB+512GB, 16GB+1TB ర్యామ్ అనే 4 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేయనుంది. కాగా, ఒప్పో ఫైండ్ X10E ఫోన్ 12GB+256GB, 16GB+512GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కానుంది.
మూడు 200MP కెమెరాలా? :
ఒప్పో ఫైండ్ X10 సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే.. కంపెనీ స్టాండర్డ్ మోడల్లో రెండు 200MP కెమెరాలను అందించవచ్చు. ఫైండ్ X10 ప్రో మ్యాక్స్‌లో మూడు 200MP కెమెరాలు ఉండొచ్చు. ఈ సిరీస్ స్టాండర్డ్ మోడల్లో 2.0 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండొచ్చు. ఒప్పో ఫైండ్ X10, ఫైండ్ X10 ప్రో మ్యాక్స్‌లలో పవర్ఫుల్ 8000mAh బ్యాటరీ ఉండొచ్చు. అయితే, ఒప్పో ఫైండ్ X10E 7000mAh బ్యాటరీతో రానుంది.
ఒప్పో ఫైండ్ X10, ఒప్పో ఫైండ్ X10E మోడళ్లలో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 9600M చిప్సెట్ అందించనుంది. ప్రో మాక్స్ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను అమర్చనుంది. ఈ ఒప్పో ఫోన్లు ఫాస్ట్ వైర్డ్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయని భావిస్తున్నారు. ఈ సిరీస్ ఫిజికల్ ఇ-సిమ్ సపోర్ట్‌తో కూడా వస్తుందని అంచనా.





