
కొన్ని వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన హేమ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా హేమ, తన కూతురు ఈషా, భర్తతో కలిసి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా హేమకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో హేమ కూతురు ఈషా ఫొటోలు వైరల్ గా మారాయి.





