
ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర నటులు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హైవాన్’ (Haiwaan). ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘హనుమాన్ అంశ్’, ‘మీర్జాపూర్: ది మూవీ’ చిత్రాల ముందు నిలబడలేకపోయింది. ట్రేడ్‌ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘హైవాన్’ దేశీయంగా మూడురోజుల్లో కేవలం రూ.7.35 కోట్ల నెట్‌ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.11.55 కోట్లుగా నమోదయ్యాయి. ఆదివారం నాటికి మరో 1400 స్క్రీన్లు కోల్పోవడంతో వసూళ్లు 26 శాతం పడిపోయాయి. కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే రోజు విశాల్ చతుర్వేది ‘హనుమాన్ అంశ్‌’కు రూ.22.50 కోట్లు రాబట్టడం గమనార్హం. ఆరో వీకెండ్‌లో ‘హనుమాన్ అంశ్’ రూ.51 కోట్లు వసూలు చేయగా.. ‘మీర్జాపూర్’ రెండో వీకెండ్‌లో రూ.36.25 కోట్లు రాబట్టింది. వీటితో పోలిస్తే ‘హైవాన్’ వసూళ్లు చాలా తక్కువ. ప్రియదర్శన్-అక్షయ్‌ కాంబోలో ఇది ఏడో చిత్రం. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించారు. ఈ ఏడాది ఆరంభంలో వీరి ‘భూత్ బంగ్లా’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. గతంలో వచ్చిన ‘తషాన్’ (2008) తొలి మూడు రోజుల్లో రూ.11 కోట్లు వసూలు చేసింది. ‘హైవాన్’ ఆ మార్క్‌ను కూడా దాటలేకపోయింది. మలయాళ సూపర్ హిట్ ‘ఒప్పం’కి రీమేక్‌గా ఈ సినిమాని రూపొందించారు. ఇందులో మలయాళ స్టార్ మోహన్‌లాల్ ఓ అతిథి పాత్ర పోషించారు. శ్రియా పిల్‌గావ్కర్, సయామీ ఖేర్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సెప్టెంబర్ 18న కరీనా కపూర్ నటించిన ‘దాయారా’, కునాల్ ఖేము ‘వైబ్’ చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘హైవాన్’కి పోటీ తప్పదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాగ్‌మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ సినిమాతో పరిచయమైన విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహాశక్తి’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).

