
Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోసారి ధరలు పెంచేందుకు దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు సిద్ధమవుతున్నాయి. 10-20 శాతం వరకు టారిఫ్ ధరలు పెరగవచ్చనే చర్చలు కొనసాగుతున్నాయి. ఈ టారిఫ్ బాదుడు నుంచి ఉపశమనం పొందాలంటే వార్షిక ప్లాన్లతో వెంటనే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. మరి ఈ జియో, ఎయిర్టెల్, వీఐలో ఉన్న ప్రస్తుతం వార్షిక రీఛార్జ్ ప్లాన్ల వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.



