
మీరు వేసుకునే దుస్తుల బ్రాండ్‌ కంటే.. మీ శారీరక దారుఢ్యమే చాలా ముఖ్యం. శరీరాకృతి బాగుంటే.. రూ.500 టీషర్ట్‌ అయినా రూ.5,000 టీషర్ట్‌ కంటే బాగా కనిపిస్తుంది. ప్రీతీశ్, ఫిట్‌నెస్‌ మెంటార్‌ ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి కానీ.. అవతలి వ్యక్తి సౌకర్యవంతంగా భావించేలా చేయడం కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. అయితే మీ వ్యక్తిత్వాన్ని శాసించే స్థితిని వాటికి కల్పించకండి. నోరు విప్పి.. మీ మనసులో ఉన్న ఆలోచనలను ఇతరులకు తెలియజేయండి. భీమ్‌ రాజ్, మైండ్‌సెట్‌ కోచ్‌ వారిని చూసి ఎగతాళి చేయకండి మీరు ఎన్నడూ ఎదుర్కోని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవారిని చూసి ఎగతాళి చేయకండి. జీవితం ఒక చక్రం వంటిది. నేటి సాదాసీదా వ్యక్తి రేపు గొప్పగా ఎదగొచ్చు. వినయంగా ఉండండి. కొన్నిసార్లు జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. లారెన్స్‌ కిటేమా, మార్కెటింగ్‌ నిపుణుడు జీవితం అంటే.. నమ్మకాల ప్రతిరూపం! సులభంగా చెప్పాలంటే.. మీ జీవితం మీ నమ్మకాల ప్రతిరూపం! నమ్మకాలు మెరుగ్గా ఉండేలా చూసుకోండి. జీవితం కూడా మెరుగవుతుంది. కోరీ విల్సన్, ఆంత్రప్రెన్యూర్‌ ఆ బాధ్యతల నుంచి పారిపోకండి మీ సామర్థ్యాలకు గట్టి సవాలు విసిరే బాధ్యతల నుంచి ఎప్పుడూ దూరంగా పారిపోకండి. ఎందుకంటే.. మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగల అసలైన శక్తి వాటికే ఉంటుంది. సెయిఫన్మి, కెరీర్‌ కోచ్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




