
Media Helicopter Crashed| ఇంటర్నెట్‌ డెస్క్‌: బస్సు ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వారు హెలికాప్టర్ నుంచి బస్సు ప్రమాదాన్ని లైవ్ కవరేజీ చేస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ విషాద ఘటన అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో చోటుచేసుకుంది. శాన్ ఫెర్నాండో వ్యాలీ గగనతలంలో మీడియా ప్రతినిధుల హెలికాప్టర్‌ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో కుప్పకూలి.. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు పార్కింగ్ ప్రాంతంలోని వ్యక్తి అని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఈ హెలికాప్టర్‌ను ఎన్‌బీసీ న్యూస్ నెట్‌వర్క్ సిబ్బంది ఉపయోగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





