
ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో తమను లక్ష్యంగా చేసుకొని కొన్ని కార్మిక సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భారత మూలాలున్న వైద్యుడు, ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకుడు ప్రేమ్‌ రెడ్డి ఆరోపించారు. లాస్‌ ఏంజిలెస్‌లోని తమ కుటుంబాలు నివాసముండే ప్రాంతాల్లోనూ వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల నిరసనలు చట్టపరిధి దాటి వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ ఆయన దావా వేసినట్లు ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ కథనంలో పేర్కొంది. సంస్థలోని ఉన్నతోద్యోగుల ప్రైవేటు నివాసాల ఏరియల్‌ ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను బ్యానర్లు, కరపత్రాలను రూపంలో వీధుల్లో పలుచోట్ల అతికిస్తున్నారని డాక్టర్‌ ప్రేమ్‌ రెడ్డి ఆరోపించారు. దీంతో తమ కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని, చిన్నపిల్లలు బయటకు రాలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నర్సింగ్ సంఘాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలా ఉంటే, అమెరికాలో ఆరోగ్య సేవల్లో పేరుగాంచిన ప్రైమ్‌ హెల్త్‌కేర్‌కు అనేక రాష్ట్రాల్లో దాదాపు 50కిపైగా ఆసుపత్రులు ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





