
కైరో: హర్మూజ్‌ జల సంధిలో నౌకల సురక్షిత రవాణాకు తాను, ఒమన్‌ తీసుకుంటున్న చర్యలను ఇరుగు పొరుగు దేశాలకు వివరించడానికి ఇరాన్‌ సన్నద్ధమవుతున్నవేళ ఆ దేశ వాణిజ్య నౌక దాడికి గురైంది. పోర్టు సిటీ బందర్‌ అబ్బాస్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖ్వెష్మ్‌ ద్వీపానికి సమీప హర్మూజ్‌ జల సంధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో నౌకలో 10 మంది సిబ్బంది ఉన్నారని, పేలుడు ధాటికి ఒకరు మృతి చెందారని ఇరాన్‌ వర్గాలు వెల్లడించాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





