
మనం ఇతరుల పట్ల దయతో, ప్రేమతో ఉండటం అనేది ఒక మంచి అలవాటు మాత్రమే కాదు.. అది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దయాగుణంతో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది. దయాగుణం.. మానసిక ప్రశాంతతతోపాటు, శారీరక ఆరోగ్యం, ఆయుష్షును కూడా పెంచుతుంది. బ్రెయిన్‌ జాన్సన్, లైఫ్‌ కోచ్‌ పిల్లలకు అనుభవ పాఠాలు చిన్నతనంలోనే నేర్పండి మీరు జీవితంలో ఆలస్యంగా తెలుసుకున్న మంచి విషయాలు, అనుభవాలను మీ పిల్లలకు చిన్న వయసులోనే నేర్పించండి. డబ్బు నిర్వహణ, సంబంధాలు, సమయం విలువ, కష్టాలను ఎదుర్కొనే విధానం వంటి కీలక పాఠాలను వారు చిన్నప్పుడే నేర్చుకుంటే.. పెద్దయ్యాక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత ధైర్యంగా, విజయవంతంగా ఎదుర్కోగలరు. ఫెయెన్‌మ్యాన్, ప్రొఫెసర్‌ ఎంత తింటున్నారో గమనిస్తున్నారా? బరువు తగ్గడం కోసం జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చే చాలామంది.. తాము రోజూ తినే ఆహారాన్ని లెక్కించడానికి మాత్రం కనీసం 2 నిమిషాలు కూడా కేటాయించరు. ఎంత తింటున్నారో గమనించుకోకపోతే, మీ అంచనా కంటే ఎక్కువ ఆహారాన్నే తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి కొన్ని వారాల పాటు మీరు తినే కెలోరీలను గమనించండి. బరువు ఎందుకు తగ్గడం లేదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మెకెంజీ స్మిత్, న్యూట్రిషన్‌ కోచ్‌ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలంటే సూటిగా మాట్లాడండి. ఎందుకంటే జనాలు సూటిగా, స్పష్టంగా చెప్పే మాటలకే విలువిస్తారు. అందుకే ఏది అనుకుంటున్నారో అదే చెప్పండి. చెప్పిన దానికి కట్టుబడండి. అప్పుడు మీ పనులెంత వేగంగా పూర్తవుతాయో చూడండి. లారెన్స్‌ కిటేమా, వ్యాపారవేత్త మిమ్మల్ని అనుమానించే వ్యక్తులకు మీ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉండడమే వారికి మీరిచ్చే గొప్ప సమాధానం. ఇతరుల ప్రతికూల ఆలోచనలు అవే నశించిపోతాయి. అసలైన బలం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదు, ప్రశాంతతను కాపాడుకోవడం. ఆడ్రీ, కంటెంట్‌ క్రియేటర్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





