
సమగ్ర వివరాల కోసం పోలీసుల కార్యాచరణ ఈనాడు, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రం ముట్టడి ఘటనలో ఎర్రవల్లితో పాటు సమీప ప్రాంతాల్లో జరిగిన శుద్ధి ఘటనపై సమగ్ర వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే శుద్ధి చేశారని ఆరోపణలున్న వరదరాజ్‌పూర్, ఎర్రవల్లితో పాటు వ్యవసాయక్షేత్రం కూడలి వద్ద ఫోరెన్సిక్‌ బృందం పర్యటించి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనలకు కారకులుగా భావిస్తూ 23 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా సీసీ ఫుటేజీలను సేకరించడంతో పాటు మరింత సమాచారం సేకరించాలని నిర్ణయించారు. వీటితోపాటు ఆందోళనలో పాల్గొన్నవారికి నోటీసులు జారీచేసి వివరాలు రాబట్టాలని యోచిస్తున్నారు. దామెరకుంటలో కాంగ్రెస్, భారాస నేతలకు మధ్య జరిగిన ఘర్షణలో 9 వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు నిర్ధారించారు. వీటిపై దాడులు చేసింది ఎవరని తేల్చేందుకు దామెరకుంటతో పాటు ప్రధాన రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. విచారణాధికారిగా నియమితులైన స్పెషల్‌ బ్రాంచ్‌ హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ త్వరలో సిద్దిపేటకు రానున్నట్లు తెలుస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





