
Konda Murali : తన పదవిని తీసేసే ధైర్యం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కొండా సురేఖ భర్త కొండా మురళి అన్నారు. నమ్మిన వాళ్ళకు న్యాయమే చేశానని ఆయన చెప్పారు. సురేఖ గెలుపునకు రాహుల్‌గాంధీ కృషిచేశారని అన్నారు. ప్రధానిని చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలే ముఖ్యమని అన్నారు. కృతజ్ఞత తమ రక్తంలో, కుటుంబంలో ఉన్నదని తెలిపారు.
ముస్లింలతో తమకు మంచి అనుబంధం ఉన్నదని కొండా మురళి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమని అన్నారు. ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదం వల్లే ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. ఉదయం ఒకవైపు, సాయంత్రం ఒకవైపు కాకుండా ఒక్కవైపే ఉండండని సూచించారు.
తమ ఇద్దరిదీ ఒకే మాట అని, తమ బిడ్డది మరొక మాట అని కొండా మురళి చెప్పారు. ఆమె ఏం చేస్తుందో తమకు తెలియదని అన్నారు. తాను బెదిరించి కబ్జా చేసినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. తమ బిడ్డ మాటలకు తమకు సంబంధం లేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి తనపై బాగా నమ్మకం ఉంచిండని, రాజశేఖర్ రెడ్డి లేని కేబినెట్లో తాము ఉండలేక పోయామని చెప్పారు. కార్యకర్తల కోసమే పార్టీలో ఉంటామని అన్నారు.
హరీష్ రావు, తాను అన్ని కులాలను కలుపుకొని పోతామని కొండా మురళి చెప్పారు. కార్యకర్తల కోసం తాను ఏమైనా చేస్తానని, వారే తన బలం, బలగం, దైర్యమని అన్నారు. తాము ఈ విధానానికే కట్టుబడి ఉంటామని తెలిపారు.





