
హైదరాబాద్ : ఎన్నో అబద్దాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పతన కాలం ( Downfall ) ప్రారంభమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిపతి శ్రీనివాస్ ( Deshipathi Srinivas ) అన్నారు. వెయ్యి రోజుల పాలనపై శాసన సభ ( Assembly ) లో చర్చిస్తామని చెప్పి ఎందుకు పారిపోయారు? కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై, ఎన్నికల హామీల అమలుపై సభలో చర్చ ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెప్పుకోవడానికి ఎలాంటి విజయాలు లేవు కనుకే, పాలకపక్షం మాతో సంఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. నాడు కేసీఆర్ తొలి కేబినెట్ లోనే 43 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే.. రేవంత్ రెడ్డి ప్రజలకు మేలు చేసే ఒక్క మంచి నిర్ణయమైనా తీసుకున్నారా? బూతులు తప్ప ప్రజలకు ఏం ఇచ్చారని నిలదీశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు, మండలి సభ్యుల మీద పోలీసుల చేత మ్యాన్హ్యండ్లింగ్ చేసిన నీచపాలనను అందించారని ఆరోపించారు. వెయ్యిరోజుల పాలనలో ఏం విజయాలు సాధించారో రేవంత్ రెడ్డి చె ప్పాలని డిమాండ్ చేశారు.






