
GHMC Labourer | జీహెచ్ఎంసీ కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారని తెలిసిందే. చెత్త సేకరణ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు అసెంబ్లీని ముట్టడించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో బంధించారు. ప్రైవేట్ ఏజెన్సీల మాయలో మూడున్నర దశాబ్ధాల ఇంటి చెత్త సేకరణ కార్మికుల పొట్టకూడదని వేడుకుంటున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ సంస్థకు తొత్తుగా మారి వాళ్లను సంకలో పెట్టుకొని మమ్మల్ని అణగదొక్కాలని చూస్తోంది.. దీన్ని అడ్డుకునేందుకు ప్రాణాలు అర్పించడానికైనా సిద్దంగా ఉన్నామని ఓ సీనియర్ జీహెచ్ఎంసీ కార్మికుడు హెచ్చరించాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఓనర్ కమ్ డ్రైవర్ అనే జీవో తీసుకొచ్చి.. ఇట్లా దొంగతనంగా కాకుండా అసెంబ్లీలో పెట్టి బహిర్గతం చేసి మీరు ఈ విధంగా బతకండి.. ఎవరికైతే బండ్లు లేవో వాళ్లకు సబ్సిడీ కింద బండ్లు ఇప్పిస్తామని ఇప్పించారు.. కేసీఆర్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం మాకు వందకు వంద శాతం చాలా ఉపయోగపడ్డది. మా జీవితాలను బాగు చేశారని సదరు కార్మికుడు చెప్పుకొచ్చారు.
మరో కార్మికురాలు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఈ పని చేస్తున్నం.. మా కష్టమేందో మేమే చేయాలి. వాళ్లు మమ్మల్ని మగవాళ్లు, ఆడవాళ్లు అని చూడకుండా కొట్టి జీపుల్లో తీసుకొస్తున్నరు. మా మహిళల మీద అంత దౌర్జన్యం చేస్తే ఏమొస్తుంది.. పుట్టినప్పటి నుంచి అదే కష్టపడుతున్నాం. మా అమ్మానాన్నల రోజుల నుండి చెత్త సేకరణ చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాము ఆ కష్టంతోనే మేం బతుకుతాం. రాంకీ కింద పనిచేయడం మావళ్ల కాదు.. మాది మాకే కావాలి.. మేమిక్కడ జీతగాళ్ల లెక్క నిల్చున్నం. రేవంత్ సర్కార్ ఓనర్లను తీసుకొచ్చి జీతగాళ్లను చేశారని మండిపడ్డది. పేరుకేమో మహిళలను కోటీశ్వరురాళ్లను చేస్తమంటరు.. మార్పు లేదు ఏం లేదు.. మమ్మల్ని రోడ్డుమీదికి తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రని ఫైర్ అయ్యింది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ సంస్థకు తొత్తుగా మారి మమ్మల్ని అణగదొక్కాలని చూస్తోంది
మా బతుకులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బూడిద చల్లుతోంది
కేసీఆర్ ఉన్నప్పుడు ఓనర్ కమ్ డ్రైవర్ అనే జీవో తీసుకొచ్చి మా జీవితాలను బాగు చేశారు
పారిశుద్ధ్య కార్మికులను రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు… https://t.co/mGGpKRmU8E pic.twitter.com/QMHtY9P8s2
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?





