
ప్ర స్తుతం బాలీవుడ్‌ సినీపరిశ్రమలో సూపర్‌హీరో జానర్‌పై ఆసక్తి పెరుగుతోంది. బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఒక సూపర్‌హీరో ప్రాజెక్టు కోసం దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకేలతో కలిసి పనిచేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఓ సూపర్‌హీరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఆర్‌.బాల్కి దర్శకత్వంలో సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్నారట. ‘‘ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది. స్క్రిప్ట్‌ ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రీకరించడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ కథ కోసం ఆమిర్‌ను సంప్రదించగా ఆయన ఆసక్తిగా ఉన్నార’’ని బాలీవుడ్‌ సినీవర్గాల సమాచారం. విభిన్నమైన జానర్లలో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించే ఆమిర్‌.. ఈ సూపర్‌హీరో చిత్రంలో ఎలా కనిపించనున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌ ‘లల్‌కార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





