
చాలామంది మహిళల్లో ఇది 40వ పడిలో (40s) ప్రారంభమవుతుంది. కొందరిలో 30ల చివర్లో లేదా 40ల ప్రారంభంలోనే మార్పులు కనిపిస్తే, మరికొందరిలో 40ల చివర్ల వరకు పెద్దగా లక్షణాలు ఉండకపోవచ్చు. ఈ దశ మెనోపాజ్ వచ్చే వరకు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. పీరియడ్స్ సైకిల్ మారడం (రోజులు తగ్గడం, పెరగడం, బ్లీడింగ్ ఎక్కువ లేదా తక్కువ కావడం) దీనికి ప్రధాన ముందస్తు సంకేతం. ఈ సమయం వంశపారంపర్య అంశాలు, ధూమపానం, అండాశయాల శస్త్రచికిత్సలు లేదా ఇతర వైద్య చికిత్సలపై ఆధారపడి ఉంటుంది. అయితే, చిన్న వయసులోనే పీరియడ్స్ అకస్మాత్తుగా మారితే వెంటనే పెరిమెనోపాజ్ అని అనుకోకూడదు. ఇతర సమస్యలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించాలి. పీరియడ్స్ క్రమం తప్పడం అనేది అతి సాధారణ ప్రారంభ లక్షణం. ఈ మార్పు చాలా నిదానంగా జరగడం వల్ల చాలామంది దీన్ని తేలికగా తీసుకుంటారు. ఇతర ముఖ్య లక్షణాలు హార్మోన్ల హెచ్చుతగ్గులు మెదడు, శరీరం రెండింటిపైనా ప్రభావం చూపుతాయి. దీనివల్ల 45 ఏళ్లు దాటిన మహిళల్లో లక్షణాలు, పీరియడ్స్ తీరును బట్టి వైద్యులు నేరుగా పెరిమెనోపాజ్గా గుర్తిస్తారు. వీరికి కేవలం రక్త పరీక్షలే ప్రామాణికం కావు. ఎందుకంటే FSH (Follicle-Stimulating Hormone) వంటి హార్మోన్లు రోజూ మారిపోతుంటాయి. 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడు, లేదా పీరియడ్స్ హఠాత్తుగా ఆగిపోయినప్పుడు థైరాయిడ్ పరీక్ష (TSH), ప్రెగ్నెన్సీ టెస్ట్ లేదా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP) వంటి రక్త పరీక్షలు చేసి ఇతర సమస్యలు లేవని నిర్ధారిస్తారు. లక్షణాలు దైనందిన జీవితాన్ని, నిద్రను, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటే వయసు సంబంధిత సమస్యే కదా అని ఊరుకోకూడదు. ఈ కింది పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని కలవాలి. సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు డాక్టర్ సౌమ్య లక్ష్మి టి.వి సీనియర్ కన్సల్టెంట్ - అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు.




