
కథలు, కవితలు, వార్తాపత్రికలను బిగ్గరగా చదవండి. వాక్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవండి. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇష్టమైన పాటలు, చిన్నప్పుడు విన్న పాటలను గుర్తుతెచ్చుకోండి. ఈజీ కార్డ్ గేమ్‌లు ఆడండి. పెద్ద పెద్ద ఆక్షరాలు, సంజ్ఞలు ఉన్న కార్డ్‌లతో గేమ్‌లు ఆడండి. మీకు బాగా సుపరిచితమైన గేమ్‌లు ఆడండి. రంగుల రంగుల పుస్తకాలను చదవండి. పెద్ద పెద్ద బొమ్మలు, ఆక్షరాలతో నిండిన కథల పుస్తకాలు చదవండి. ఖాళీ సమయంలో గార్డెనింగ్ చేయండి. పూలు, పండ్లు కోయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటివి చేయండి. వంట గదిలో పాత్రలు కడగటం, సింక్ క్లీన్ చేయడం వంటివి చేయండి. దీని వల్ల ఒక పని పూర్తి చేశామనే భావన కలుగుతుంది. దుస్తులు మడతపెట్టడం, దుస్తులను చక్కగా అమర్చడం వంటివి చేయండి. దీని వల్ల ఏదోఒకటి సాధించామనే భావన కలగుతుంది. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడు పనితీరు రెట్టింపు అవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పచ్చని ప్రకృతిలో వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంగీతం వింటూ వాకింగ్ చేయండి. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.





