
వినాయక చవితి సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మోదకంతో పాటు పూరణ్ పోళీ, లడ్డూలు, ఖీర్, శీరా, కొబ్బరి స్వీట్లు, అరటిపండ్లు, ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. ఉపవాసం చేసేవారు తమ ఆచారాలకు అనుగుణంగా సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను సమర్పించవచ్చు. అలాగే గణపతి పూజలో దుర్వ గడ్డికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా.. సంప్రదాయంగా 21 దుర్వలను బప్పాకు సమర్పిస్తారు..



