

- ఖైరతాబాద్కి పోటెత్తిన భక్తజనం
- షీ టీమ్స్ ప్రత్యేక నిఘా
- సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత
Khairatabad Bada Ganesh; హైదరాబాద్లోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఖైరతాబాద్ బడా గణనాథుడిని (Khairatabad Bada Ganesh)దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నగర నలుమూలల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో భక్తుల రద్దీ తీవ్రరూపం దాలుస్తుండటంతో, సాధారణ క్యూ లైన్లతో పాటు వీఐపీ మార్గాలు కూడా పూర్తిగా భక్తజనసందోహంతో నిండిపోయాయి.
Chandrababu-Bandaru Dattatreya: చంద్రబాబును కలిసిన బండారు దత్తాత్రేయ.. అలయ్-బలయ్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం
పోలీసుల పటిష్ట బందోబస్తు.. షీ టీమ్స్ నిఘా:
భక్తుల భద్రత, తోపులాటలు జరగకుండా నివారించేందుకు పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉత్సవాలు ముగిసే వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత పటిష్టమైన బందోబస్తు అమల్లో ఉంటుందని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ సిబ్బందిని రంగంలోకి దించినట్లు వివరించారు. ఈవ్టీజర్లు, జేబుదొంగలపై నిరంతర నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు విధుల్లో ఉన్నాయి.
సీసీ కెమెరాల నిఘాలో నిమజ్జనం వరకు భద్రత:
ప్రాంగణమంతటా భారీ సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. తొమ్మిది రోజుల పూజా కార్యక్రమాలతో పాటు చివరి రోజు జరిగే మహా నిమజ్జనం పూర్తయ్యేంత వరకు ఇదే తరహా కఠిన భద్రతా ప్రమాణాలు కొనసాగుతాయని డీసీపీ స్పష్టం చేశారు. పోలీసుల పక్కా ప్రణాళిక మరియు సమన్వయంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.



