
అమరావతి: కోచింగ్‌ కేంద్రాలు రాజకీయ కుట్రలకు వేదిక కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu ) అన్నారు. కోచింగ్‌ సెంటర్ల అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే కోచింగ్‌ సెంటర్లపై చట్టపరంగా కొరడా ఝుళిపించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులను రాజకీయ ఆందోళనలకు వినియోగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోచింగ్‌ సంస్థలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అభ్యర్థులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా.. పరీక్షలపైనే దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఏపీలో పురపాలక ఎన్నికల దిశగా ఈసీ అడుగులు స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో యువత శక్తి, ఆలోచనలు, నైపుణ్యాలే కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్టోబర్‌ 3న విజయవాడలో జరిగే పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌-2026లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డీప్‌టెక్‌, స్పేస్‌టెక్‌, క్లీన్‌ ఎనర్జీ, డేటా సెంటర్లు, అధునాతన తయారీ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఎదుగుతోందని వెల్లడించారు. యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, ఐఐటీ పూర్వ విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులు తమ ఆలోచనలు, అనుభవంతో ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నంలో గణేశ్‌ నవరాత్రి (Ganesh Chaturthi) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రైలు (Train) ఎక్కుతూ జారిపడ్డ వ్యక్తిని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కాపాడిన ఘటన కాకినాడ (Kakinada) జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయకుడు (Ganesh Chaturthi) విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు.




