
పొరపాటున చేరిస్తే వెంటనే అధికారులు తొలగిస్తారు ఇకపై సమగ్ర విచారణ తరువాతే ఈ జాబితాలోకి శాసనసభలో ప్రకటన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: నిషేధిత భూముల జాబితాలో ఏదైనా భూమిని కొత్తగా చేర్చాలంటే ప్రత్యేకంగా నిర్దిష్ట విధానంలో ముందుకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ భూమినీ కొత్తగా 22ఏలో చేర్చలేదని వెల్లడించారు. 22ఏ జాబితాలో చేర్చేందుకు అనుసరించే విధానంపై బుధవారం శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ‘‘సమగ్ర విచారణ అనంతరం వివరాలన్నీ నిషేధిత జాబితాలో చేరుస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాన్యువల్‌గా నమోదు చేయబోం.. ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తాం. ఉమ్మడి ఏపీ నుంచి 22ఏ భూముల జాబితా కొనసాగుతోంది. పదేళ్ల భారాస పాలనలోనూ ఉంది. ఈ జాబితాను అప్‌డేట్‌ చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్లు పాత జాబితానే అప్‌డేట్‌ చేశారు. ఇక నుంచి ఈ జాబితాలో భూమిని చేర్చే విషయంలో స్పష్టమైన విధానాలు అవలంబిస్తాం. విచారణ అనంతరం ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులపై అసంతృప్తి ఉంటే.. 60 రోజుల్లో జాయింట్‌ కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు. ఆ ఉత్తర్వులపైనా 90 రోజుల్లో ప్రభుత్వానికి రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. విచారణ అనంతరం భూమిని 22ఏ జాబితాలో చేర్చడానికి లేదా చేర్చకపోవడానికి కారణాలు పేర్కొంటూ అధికారులు స్పీకింగ్‌ ఆర్డరు జారీ చేస్తారు. 22ఏ జాబితాకు సంబంధించి వ్యవసాయ భూమి విస్తీర్ణం ఎకరాకు, వ్యవసాయేతర భూమి వెయ్యి గజాలకు మించితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. పూర్తిస్థాయి పరిశీలన, నోటీసు, విచారణ, ఉత్తర్వుల ప్రక్రియ పూర్తయిన తరువాతే భూమిని ఐజీఆర్‌ఎస్‌ కేంద్ర డేటాబేస్‌లో ఆన్‌లైన్‌ విధానంలో చేరుస్తారు. నిషేధిత జాబితాలో చేర్చే ప్రక్రియ ఇలా.. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





