
సిగరెట్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్. గతంలో కేంద్రం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, సుంకాలు పెంచడంతో సిగరెట్ ధరలు ఒకేసారి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కంపెనీలన్నీ సిగరెట్ ధరలు పెంచడంతో ధూమపానం చేసేవారిపై మరింత భారం పడింది. అయితే ఇప్పుడు మరోసారి సిగరెట్ ధరలు పెరిగాయి. ఈ మేరకు ఐటీసీ కంపెనీ పలు బ్రాండ్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలతో సిగరెట్ ప్యాక్‌లు ఇప్పటికే మార్కెట్లోకి కూడా వచ్చేశాయి. ఏయే బ్రాండ్లపై ధరలు పెరిగాయనేది ఒకసారి చూద్దాం.





