
27 నెలల్లో 3,207 మందిపై సెక్సువల్‌ అఫెండర్‌ షీట్లు జియో ట్యాగింగ్, డిజిటల్‌ మానిటరింగ్‌తో కార్యకలాపాలపై గురి ఈనాడు, అమరావతి: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిపై రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ఇలాంటి కేసుల్లో శిక్షలు పడినవారు, నిందితులపై లైంగిక నేరగాళ్ల షీట్లు (సెక్సువల్‌ అఫెండర్‌ షీట్లు) తెరుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 3,207 మందిపై ఈ షీట్లు తెరిచారు. 2012 నుంచి 2024 వరకూ 12 ఏళ్లలో 2,589 మందిపై ఈ షీట్లు తెరవగా.. 27 నెలల్లోనే అంతకంటే ఎక్కువ మందిపై ఈ షీట్లు నమోదుచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,796 మందిపై ఈ షీట్లున్నాయి. శిక్షలు పడినవారు, నిందితుల పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్, ఫొటో, గతంలో వారిపై నమోదైన లైంగిక నేరాల కేసులు, ఏయే పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి? ఆయా కేసుల ప్రస్తుత స్థితి, బెయిల్‌పై ఉన్నారా, జైల్లో ఉన్నారా తదితర వివరాలన్నింటినీ వీటిలో పొందుపరుస్తున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాల నియంత్రణకు ఈ విధానం దోహదపడుతోందని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




