
నగర హోటళ్లలో తీవ్రమైన ఉల్లంఘనలు పారిశుద్ధ్య లోపం... నాణ్యతలేని ఆహారం తనిఖీల్లో గుర్తించిన కల్తీ, బూజుపట్టిన ఆహార పదార్థాలు ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో చాలా రెస్టారెంట్లు, హోటళ్లల్లో నాణ్యత డొల్లతనం బయట పడుతోంది. తాజాగా టీజీ సేఫ్‌ కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ సర్కిళ్ల పరిధిలోని 50పైగా రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్, పీజీ హాస్టల్లో తనిఖీలు చేపట్టగా.. 80శాతం లోపాలు కనిపించాయంటే నిర్వహణ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు యావ తప్పా.. నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమవుతున్నాయి. ఫ్రిజ్‌ల్లో బూజుపట్టిన కాయగూరలు, మటన్, చికెన్‌లాంటివి ఆహార పదార్థాలు గుర్తించారు. మసాలాలు దట్టించి వడ్డిస్తున్నట్లు తేటతెల్లమైంది. పేరున్న రెస్టారెంట్లలో కల్తీ, అపరిశుభ్రత చూసి అధికారులే కంగుతిన్నారు. వంట గదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నట్లు గుర్తించి.. పదికిపైగా హోటళ్ల లైసెన్సు రద్దు చేశారు. మరో 15 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు అందించారు. హోటళ్లు, రెస్టారెంట్లపై నిఘా కొరవడుతోందనే విమర్శలున్నాయి. నెలవారీ మామూళ్లు అందుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిన్న రెస్టారెంట్లలో కూడా భోజనం, బిర్యానీ లాంటివి కనీసం రూ.150-200కు విక్రయిస్తున్నారు. ధరల్లో రాజీ పడటం లేదు. కనీస శుభ్రత, స్వచ్ఛమైన నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





