
సత్యకృపాల్‌ డాంగే (పాత చిత్రం) మంగళగిరి టౌన్, న్యూస్‌టుడే: మంగళగిరి జువెలరీ అండ్‌ బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అవ్వారు సత్యకృపాల్‌ డాంగే (72) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బీసీ సంఘం ప్రైవేటు సెక్టార్‌ సబ్‌ప్లాన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, శ్రీమార్కండేయ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యుడిగా, పద్మశాలి ఇంటర్నేషనల్‌ వెల్ఫేర్‌ సంఘ మంగళగిరి శాఖ అధ్యక్షుడిగా విశిష్ట సేవలందించారు. ఆయన మృతికి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు గుత్తికొండ ధనుంజయరావు, తెదేపా పద్మశాలీ సాధికార సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నాదుల బాలకృష్ణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డాంగే చిరస్మరణీయుడు: మంత్రి లోకేశ్‌ తాడేపల్లి, న్యూస్‌టుడే: సేవా దృక్పథంతో పనిచేసిన సత్యకృపాల్‌ డాంగే చిరస్మరణీయులని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయడమే మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. తన విజయానికి ఆయన కృషి చేశారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





