
ఏళ్ల తరబడి పూర్తికాని అనేక ప్రాజెక్టులు ఈనాడు, అమరావతి కృ ష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అనేక అభివృద్ధి పనులు ఏళ్లుగా సాగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్‌ టర్మినల్, బందరు పోర్టు, హార్బర్‌ మొదలు దుర్గగుడిలో బృహత్తర ప్రణాళికలో పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గణనాథుడి ఆశీస్సులతో అన్ని విఘ్నాలు తొలగిపోవాలని.. ఈ ఏడాదైనా అభివృద్ధి పనులు పూర్తవ్వాలని అంతా కోరుకుంటున్నారు. కొత్త టెర్మినల్‌ పూర్తవ్వాలి.. రూ .470 కోట్లతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను ఎలాగైనా డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యం. అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి సేవలను ఆరంభించాలంటే దానికి తగ్గట్టుగా అన్ని సౌకర్యాలతో టెర్మినల్‌ అవసరం. ప్రస్తుతం రోజుకు 850 మంది కూలీలు, పదుల సంఖ్యలో ఇంజినీర్లు పనుల్లో పాల్గొంటున్నారు. అనుకున్నట్టే పనులను త్వరగా చేపట్టి ఆలస్యం చేయకుండా నూతన టెర్మినల్‌ను ప్రారంభించాలి. కృష్ణా నీరు ఇచ్చేది ఎప్పటికి? రూ .50కోట్లతో ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన కృష్ణా జలాల ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయినా గత ఐదారు నెలలుగా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ట్రయల్‌రన్‌ పేరుతోనే ప్రస్తుతం గిరిజన తండాలకు నీటిని అందిస్తున్నారు. ఇప్పటికీ పైప్‌లైన్లు, నీటి సరఫరా విషయంలో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించి త్వరగా పూర్తిచేయాలి. మ చిలీపట్నం ఓడ రేవు పనులకు చాలా ఏళ్లుగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. లక్ష్యాలు మారుతున్నాయి. తాజాగా 2027 జూన్‌ నాటికి అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. ఇప్పటివరకూ 58శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. భారీ ఓడలు ఒడ్డుకు చేరేందుకు అవసరమైన.. 17 కిలోమీటర్ల కాలువను సముద్రంలో తవ్వాలి. ఇది ఇంతవరకూ ఆరంభించలేదు. డ్రెడ్జింగ్‌ పరికరాలు విదేశాల నుంచి రావాలి. బెర్త్‌లు 90శాతం పూర్తయ్యాయి. పరిపాలన భవనాలు, గోదాములు తుది దశకు చేరాయి. జాతీయ రహదారి నుంచి పోర్ట్‌ను కలిపే దారి ఇంకా ఆరంభించలేదు. హార్బర్‌: మచిలీపట్నం గిలకలదిండి రేవును రూ.421 కోట్లతో చేపడుతున్నారు. 2023 మార్చికి పూర్తి చేయాలనేది లక్ష్యం. కానీ ఇప్పటికి 70శాతం పూర్తయ్యాయి. మిగతా 30శాతం పూర్తి చేయాల్సి ఉంది. 2026 మార్చికల్లా పూర్తిచేయాలని కొత్తగా లక్ష్యం నిర్దేశించినా పూర్తవ్వలేదు. కనీసం ఇప్పటికైనా అన్ని ఆటంకాలను అధిగమించి త్వరగా పూర్తి చేయాలి. దుర్గగుడిలో..: దుర్గగుడిలో ప్రధానంగా కాటేజీలు, రెండో ఘాట్‌రోడ్డు, మల్టీలెవెల్‌ పార్కింగ్‌ వ్యవస్థ, ఘాట్లలో సౌకర్యాలు పూర్తవ్వాలి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





