
ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. వచ్చే నెల చివరికల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో పార్టీలు కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎవరికి వారు తమ సత్తా చాటాలని డిసైడ్ అయ్యాయి. కూటమిగా కలిసి పనిచేస్తూనే.. తమకు బలం ఉన్న ప్రాంతాల్లో పట్టు నిరూపించుకోవాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. ఇదే సమయంలో.. బీజేపీ కూడా స్థానిక ఎన్నికలను అవకాశంగా చూస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తన బలాన్ని చూపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది.





