
57 ఎకరాల్లో పీపీపీ విధానంలో పలు ప్రాజెక్టులు గతంలో నడిపిన సంస్థకు ఐదు ఎకరాల కేటాయింపు ఈనాడు, అమరావతి గతంలో రెండు దశాబ్దాల పాటు నడిచిన డిస్నీల్యాండ్‌ వి జయవాడ సింగ్‌నగర్‌లో డిస్నీల్యాండ్‌కు సంబంధించిన 57 ఎకరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒకరికే కాకుండా పలు ప్రాజెక్టులకు కేటాయించనున్నారు. గతంలో డిస్నీల్యాండ్‌ను నడిపిన సంస్థకు తొలుత ఐదు ఎకరాలను ఇక్కడ కేటాయించడానికి నివేదికలు సిద్ధమయ్యాయి. తాము పూర్తిస్థాయిలో ఇక్కడ గతంలో మాదిరిగానే డిస్నీల్యాండ్‌ను ఏర్పాటు చేస్తామంటూ సదరు సంస్థ తాజాగా ప్రతిపాదన పెట్టింది. మొత్తం స్థలమంతా అవసరం లేదని, తమకు ఐదు ఎకరాలు ఇవ్వాలంటూ కోరింది. దీంతో తొలుత ఈ సంస్థకే ఐదు ఎకరాలను కేటాయించనున్నారు. మిగతా 52 ఎకరాలను సైతం పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీల్యాండ్‌ మాదిరిగానే కడతామంటూ మరికొందరు సైతం ముందుకొచ్చారు. కొందరు ఫిల్మ్‌స్టూడియో పెడతాం, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు నెలకొల్పుతామంటూ వస్తున్నారు. లీజు ముగిసిన తర్వాత వదిలేశారు.. ఒకప్పుడు నగరానికే ప్రత్యేక ఆకర్షణ వి జయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 1999లో సింగ్‌నగర్‌లోని వాంబేకాలనీలోని 57 ఎకరాల ప్రభుత్వ స్థలంలో డిస్నీల్యాండ్‌ను ఏర్పాటు చేశారు. 20ఏళ్ల లీజుకు సిబార్‌ కంపెనీకి ఈ స్థలాన్ని అప్పగించారు. 2019 వరకు ఇది బాగానే నడిచింది. విజయవాడతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి జలక్రీడల కోసం భారీ సంఖ్యలో తరలివచ్చేవాళ్లు. చుట్టూ పచ్చని వాతావరణం, పక్షుల కిలకిలరావాల మధ్యలో వాకింగ్‌ ట్రాక్స్, స్విమ్మింగ్‌ పూల్స్, సాహస క్రీడలుండేవి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





