
పాడేరు: అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో స్థానిక సాయి బాబా వీధికి చెందిన లక్ష్మీ అనే వివాహిత వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం సాయంత్రం లక్ష్మీ తన భర్తతో గొడవ పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఉదయం చిడిపుట్టు వంతెన సమీపంలో వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు వివాహితను రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





