
నాలుగేళ్ల వయసు నుంచే డయాబెటిస్‌ వెంటాడింది. క్రీడల జోలికీ వద్దని వైద్యులు తేల్చారు. కానీ, అవేవీ అతడిని ఆపలేకపోయాయి. అందుక్కారణం అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం. ఎవరేమనుకున్నా సరే.. తన కుమారుడిని ఇష్టమైన రంగంలో తీర్చిదిద్దాలని పట్టుపట్టారు. అందుకు తగ్గినట్టుగా అతడూ కష్టపడ్డాడు. ఎట్టకేలకు తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచాడు. ఇదీ అలెగ్జాండర్ జ్వెరెవ్ పోరాటం వెనుకున్న స్ఫూర్తిదాయమైన స్టోరీ.. జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexander Zverev) 2013లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాడు. కానీ, ఇప్పటివరకు అతడు సాధించిన గ్రాండ్‌స్లామ్‌లు కేవలం రెండే. ఇప్పుడు యూఎస్ ఓపెన్‌ (US Open 2026) కాకుండా.. ఇంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్. అదీనూ ఇదే ఏడాది కావడం గమనార్హం. ప్రస్తుత సంవత్సరంలో మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు చేరిన అతడు రెండింటిని సొంతం చేసుకున్నాడు. ఓ వైపు కార్లోస్ అల్కరాస్, యానిక్ సినర్ వంటి కుర్రాళ్లు దూసుకుపోతున్న వేళ.. సీనియర్‌ అయిన జ్వెరెవ్‌ మాత్రం అడపాదడపా మాత్రమే ప్రధాన టోర్నీల్లో కనిపించేవాడు. దానికి కారణం డయాబెటిస్‌. అవును.. జ్వెరెవ్ నాలుగేళ్ల వయసులోనే టైప్ 1 డయాబెటిస్ (Type 1 diabetes) బారిన పడ్డాడు. అతడిని చూసిన వైద్యులు ఆటకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. కానీ, అతడి తల్లి మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇదే విషయాన్ని యూఎస్ ఓపెన్ ఫైనల్ అనంతరం జ్వెరెవ్ ప్రత్యేకంగా వెల్లడించాడు. ఈ విజయాన్ని తన తల్లికి (Alexander Zverev Mother) అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన నాలుగేళ్ల కుమారుడు డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని తెలిసినప్పుడు.. ఆ పిల్లాడి జీవితంలో స్పోర్ట్స్‌ చాలా పరిమితమని చెప్పినప్పుడు.. ‘నా కుమారుడు ఏది అవ్వాలనుకుంటే అది అవుతాడు’ అని ధైర్యంగా చెప్పాలంటే ఆ తల్లికి ఎంతటి దృఢమైన మనస్తత్వం కలిగి ఉండాలి. ఏ రంగంలోనైనా రాణించగలడని ఆమె నమ్మింది. అందుకే, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన.. గొప్ప మహిళ మా అమ్మే - జ్వెరెవ్ నాలుగేళ్ల కిందట తొలిసారి పబ్లిక్‌గా తనకు డయాబెటిస్ ఉందని జ్వెరెవ్ (Alexander Zverev) వెల్లడించాడు. అప్పుడు అతడు వరల్డ్ 2 ర్యాంకర్‌ కావడం గమనార్హం. కానీ, అప్పటికి ఒక్క గ్రాండ్‌స్లామ్‌ను కూడా సాధించలేదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు. అంతేకాకుండా.. తనలా ఇబ్బంది పడే చిన్నారుల కోసం ‘అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫౌండేషన్‌’ను స్థాపించాడు. మధుమేహం కలిగిన పిల్లలకు ఇన్సులిన్, మెడికేషన్‌ అందించేందుకు సహకారం అందిస్తుంటుందీ ఫౌండేషన్. 2022లో జ్వెరెవ్‌ (Alexander Zverev) ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతుండగా మోకాలికి గాయమైంది. ఇక మరుసటి ఏడాదే వ్యక్తిగతంగా ఒడుదొడుకులకు గురయ్యాడు. జ్వెరెవ్‌పై అతడి మాజీ భాగస్వాములు ఓల్గా షర్యపోవా, బ్రెండా పాటియా గృహహింస ఆరోపణలు చేశారు. సరైన ఆధారాలు లేవని కోర్టు అవన్నీ కొట్టేసింది. జ్వెరెవ్ - బ్రెండా పాటియాకు ఓ పాప ఉంది. పాటియాకు సంబంధించిన మరో కేసులో జ్వెరెవ్‌కు జర్మనీ కోర్టు జరిమానా కూడా విధించింది. 2024 జూన్‌లో వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. ఈ వివాదాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడి మరీ కెరీర్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగిపోతున్నాడీ టెన్నిస్ ఆటగాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మహిళల ఆసియా కప్‌ను ఎనిమిదోసారి టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ మీరూ చూసేయండి.. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.





