
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం రోజురోజుకూ ఉద్యోగ రంగంపై పెరుగుతోంది. ఇప్పటికే డేటా విశ్లేషణ, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, రిపిటీటివ్ టాస్క్ వంటి అనేక కార్యకలాపాలను AI వేగంగా నిర్వహిస్తోంది. దీంతో భవిష్యత్ ఉద్యోగాల్లో కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా మానవ నిర్ణయ సామర్థ్యం, వ్యాపార అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరగనుంది. IMA రూపొందించిన Management Accounting Competency Index (MACI) లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది..





