
గుమ్మలక్ష్మీపురం: కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 2న విశాఖలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించనున్నారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆయా సంఘాల జేఏసీ జిల్లా నాయకులు పోలినాయుడు, బి.వి.రమణ, దివాకర్ పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, దినసరి వేతన సిబ్బందితో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించి, ఎంటీఎస్ వర్తింపచేయాలని, ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లే జీవో నంబర్-2 రద్దు చేయాలన్నారు. చాలీచాలని వేతనాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వారి వెంట నాయకులు చిట్టిబాబు, గోవర్ధన్ తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




