
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 పోరులో భారత బౌలర్లు మరోసారి విరుచుకుపడ్డారు. శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా, భారత యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తమ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.





