
9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమెరికా సీఐఏ విడుదల చేసిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్లో బిన్ లాడెన్ ఉగ్ర కుట్రలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998లో బిన్ లాడెన్ దాడులకు పరిశీలించిన దేశాల జాబితాలో భారత్ పేరు కూడా ఉన్నట్లు వెల్లడైంది. పాకిస్థాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా, నైజీరియా పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి.






