
మోఖి (చైనా): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌ (FIH Women’s Junior world cup)లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచి స్వర్ణం సాధించింది. చైనాలో జరిగిన ఫైనల్‌లో భారత్ 1-0 తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను భారత క్రీడాకారిణి సానిక చంద్రకాంత్ మనే 17వ నిమిషంలో సాధించింది. భారత మహిళల జట్టు ఈ కప్‌ను గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. ఈ విజయం ద్వారా జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు స్థానం ఖరారైంది. ఛాంపియన్స్‌గా అవతరించిన నేపథ్యంలో హాకీ ఇండియా నగదు ప్రోత్సాహం ప్రకటించింది. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ రూ.1.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






