
దిల్లీ: భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తున్న అఫ్గానిస్థాన్‌ తడబడుతోంది. 10 ఓవర్ల నాటికి ఐదు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఒమర్జాయ్‌ (10*), నబీ (4*) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ గుర్బాజ్‌ను ఇన్నింగ్స్‌ రెండో బంతికే బుమ్రా డకౌట్‌ చేశాడు. అర్ష్‌దీప్‌, అక్షర్‌పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్‌ తీశారు. కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ (11) రనౌటయ్యాడు.






